ePaper
Tuesday, August 4, 2026
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్ఆసరా పింఛన్ల కు లైవ్ అథెంటికేషన్ తప్పనిసరి 

ఆసరా పింఛన్ల కు లైవ్ అథెంటికేషన్ తప్పనిసరి 

📰 Generate e-Paper Clip

తహసీల్దార్ కే బాలశంకర్

మన తొలివెలుగు, చాంద్రాయణగుట్ట ప్రతినిధి శైలేష్ కుమార్ 

బహదూర్‌పురా మండల తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ఆసరా పింఛన్ల లైవ్ అథెంటికేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, పింఛన్ లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ద్వారా లైవ్ అథెంటికేషన్ పూర్తి చేసుకున్న వారికే వచ్చే నెల నుంచి ఆసరా పింఛన్లు యథావిధిగా జమ అవుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఎండను లెక్కచేయకుండా కర్రల సాయంతో, వీల్ చైర్లలో వృద్ధులు, దివ్యాంగులు తరలివచ్చారు. రద్దీ దృష్ట్యా సిబ్బంది జూనియర్ అసిస్టెంట్ మౌనిక, కృష్ణ మోహన్, రికార్డు అసిస్టెంట్ సౌందర్య, ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అథెంటికేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. అయితే వయోవృద్ధుల కోసం తాగునీరు, టెంట్లు, కూర్చునేందుకు కుర్చీల సౌకర్యం మరింత పెంచాలని లబ్ధిదారులు విజ్ఞప్తి చేశారు. అథెంటికేషన్ పూర్తి కాని వారు త్వరగా మండల కార్యాలయాన్ని సంప్రదించాలని తహసీల్దార్ కే బాల శంకర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ కే. రమేష్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!