మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
ప్రశాంతి హిల్స్ డివిజన్ పరిధిలోని నంది హిల్స్‌లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి వెళ్తుండగా రెండు కాళ్లు లేని ఓ యువతి కుటుంబ సభ్యులు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని కలిసి అమ్మా… మా పాపను ఒక్కసారి పలకరించండి, మీతో ఒక ఫోటో దిగాలని కోరుకుంటోందని విన్నవించుకున్నారు. వెంటనే స్పందించిన సబితా ఇంద్రారెడ్డి ఆ యువతి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. ఎమ్మెల్యే ఆత్మీయతతో ఆ అమ్మాయి కళ్లల్లో ఆనందం రెట్టింపైంది. ఈ సందర్భంగా ఆ యువతి అమ్మా… నాకు ఒక ట్రై సైకిల్ ఇప్పించగలరా అని అభ్యర్థించగా, వెంటనే స్పందించిన సబితా ఇంద్రారెడ్డి ఆ అమ్మాయికి ట్రై సైకిల్ అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

అప్పటికప్పుడే ఆగమేఘాల మీద ట్రై సైకిల్‌ను ఆ యువతి ఇంటికి చేరవేయడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆశ్చర్యంతో పాటు సంతోషంతో నిండిన ఆ యువతి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సిరెడ్డి, మహిళా అధ్యక్షురాలు సునీత బాలరాజ్ , ప్రవీణ్ రెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు.

