మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్
మన తొలి వెలుగు: కుత్బుల్లాపూర్ ప్రతినిధి టీ. రమేష్
ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతిరూపమని జగద్గిరిగుట్ట డివిజన్ మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్ అన్నారు. గురువారం బక్రీద్ పండుగను పురస్కరించుకుని డివిజన్ పరిధిలోని మగ్దుమ్ నగర్ లోని ఈద్గా లో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థన (నమాజ్) లో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం జగన్ డివిజన్ ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బక్రీద్ పండుగ రోజున ముస్లింలు పేదలకు దానం చేయడం ఆనవాయితీగా కొనసాగుతుందన్నారు. జగద్గిరిగుట్ట డివిజన్ సర్వ మతాలకు నిలయమన్నారు. కుల మతాలకు అతీతంగా వేడుకలు నిర్వహించుకుని మతసామరస్యాన్ని చాటాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సయ్యద్ రషీద్, మహమూద్, హాజీ, అన్వర్, యాసీన్, జాంగిర్, చాంద్ పాషా, సత్తిరెడ్డి, జనగామ శ్రీధర్, సాయిల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

