ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeకుత్బుల్లాపూర్నిజాంపేట్ ఎస్ఎన్డీపీ పనులపై విజిలెన్స్ విచారణ జరపాలి

నిజాంపేట్ ఎస్ఎన్డీపీ పనులపై విజిలెన్స్ విచారణ జరపాలి

📰 Generate e-Paper Clip

బీజేపీ అధ్యక్షులు బిక్షపతి యాదవ్

మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టి. రమేష్ :

కమిషన్లకు కక్కుర్తిపడి ఎస్ఎన్డీపీ పనులు చేయడం ద్వారా ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని బీజేపీ అధ్యక్షులు బిక్షపతి యాదవ్ ఆరోపించారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ లో ఎస్ఎన్డీపీ పనుల నాణ్యత ప్రమాణాలలో లోపంతో పాటు నాలాల నిర్మాణం అనేది ఒక క్రమబద్ధంగా జరగడంలేదని ఆరోపించారు. అప్పుడున్న కమిషనర్ తో పాటుగా అధికారులకు ఎంత మొరపెట్టుకున్నా కూడా అసంబద్ధంగా పనులు పూర్తి చేయడమే కాకుండా కొన్ని పనులను మధ్యలోనే ఆపివేయడం ద్వారా ప్రజాధనం వృధా అవ్వడమే కాకుండా మళ్లీ వర్షం పడితే ఎక్కడ నీళ్లు అక్కడే ఆగి ఉండడం ద్వారా బండారి లేఔట్ కాలనీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్పొరేటర్లుగా పదవిలో ఉన్నప్పుడు కమిషన్లకు కక్కుర్తి పడి పనులు అసంపూర్తిగా పూర్తి చేయడం వలన ఈ పరిస్థితి దాపురించిందని అలాగే ఎస్ఎన్డీపీ పనుల నిమిత్తం దాదాపు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ నుండి ప్రజలు చెల్లించిన పన్నుల ద్వారా వసూలైన రూ. 30 కోట్లు కార్పొరేషన్ చెల్లించడంపై కమిషన్ల రూపంలో అధికారులు, ప్రజాప్రతినిధుల చేతులు మారాయని ఆరోపించారు. రాబోయే వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని అధికారులు సరైన చర్యలు వెంటనే తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ నిజాంపేట మరియు బండారి లే అవుట్ అధ్యక్షులు బిక్షపతి యాదవ్ డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!