ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeతెలంగాణరంగారెడ్డితమ ఓటు పదిలంగా ఉండాలంటే తప్పని సరిగా బీఎల్ఓ, బీఎల్ఏ అధికారులకు ప్రజలు సహకరించాలి

తమ ఓటు పదిలంగా ఉండాలంటే తప్పని సరిగా బీఎల్ఓ, బీఎల్ఏ అధికారులకు ప్రజలు సహకరించాలి

📰 Generate e-Paper Clip

నెలలోపు ఓటర్లు బీఎల్ఓ అధికారులకు సహకరించాలి

లేకపోతే ఓట్లు తొలగించబడతాయి..తాము బాధ్యులం కాదు

 

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగడానికి, అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించడానికి బీఎల్ఓలకు ప్రజలు, బూత్ లెవెల్ ఏజెంట్లు స్థానిక వివిధ పార్టీల రాజకీయ నాయకులు పూర్తిగా సహకరించాలని జల్ పల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వెంకట్రావు తెలిపారు. మ్యాపింగ్, ఎస్ఐర్ మ్యాపింగ్ అంశంపై కార్యాలయంలో శనివారం ఆయన వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్కిల్ పరిధిలో ఇప్పటి వరకు కేవలం 43 శాతం మాత్రమే మ్యాపింగ్ జరిగిందని, మిగిలిన 57 శాతం మ్యాపింగ్ కు కేవలం నెల రోజుల వ్యవధి మాత్రమే ఉన్నందున రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు. ప్రతి పార్టీ నుంచి బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకొని ప్రజలకు అవగాహన కల్పించి మ్యాపింగ్ పూర్తి చేసేలా కృషి చేయాలన్నారు. గడువు ముగిస్తే ఓట్లు గల్లంతయ్యే విషయాన్ని ఓటర్లు గమనించుకోవాలన్నారు. నెలరోజుల పాటు సమయం ఉందని ప్రతి ఒక్కరు సహకరించాలని భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు తమ బాధ్యత కాదన్నారు. ఓటర్ జాబితాలో ఉన్నవారు, 18 సంవత్సరాల పూర్తి చేసుకున్న కొత్త ఓటర్లు, వేరే చోటుకు మారిన కుటుంబాలు, అద్దెకు నివాసమున్నవారు మ్యాపింగ్ చేయించుకోవాలన్నారు. సెన్సెస్ కు కూడా ప్రతి ఒక్కరు సహకరించి తమ వివరాలు వెల్లడించాలన్నారు. ప్రతి ఓటర్ ని కలుస్తారు. ప్రతి ఇంటికి మూడుసార్లు బీఎల్ ఓ అధికారులు వస్తారన్నారు. ఎస్ఐఆర్ వల్లనే వెస్ట్ బెంగాల్లో 90% పోలింగ్ జరిగిందన్నారు. ఎక్కడో ఒక్కచోట మాత్రమే ఓటు ఉండాలన్నారు. బీఎల్ఓ అధికారులకు సహకరించకపోతే ఒక నెలలో 57% ఓట్లు తొలగించబడతాయ అన్నారు. జరగబోయే పరిణామాలకు తాము బాధ్యులం కాదన్నారు. జల్ పల్లి సర్కిల్ పరిధిలోని మామిడిపల్లి , రంగనాయకుల కాలనీ కాకుండా 90 వేలకు పైగా ఓటర్లు ఉన్నారన్నారు. ఓటరు జాబితా సవరణ, కొత్త ఓటరు నమోదు లేదా ఓటరు కార్డుల పంపిణీ సందర్భంగా బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వస్తారన్నారు. బంగ్లాదేశ్ బర్మా వాసులను కూడా మ్యాపింగ్ చేస్తారన్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగడానికి, అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించడానికి బీఎల్ఓ లకు ప్రజలు పూర్తిగా సహకరించాలని మ్యాపింగ్ 2011 ఓటర్ల జాబితా ఆధారంగా ఓటర్ల మ్యాపింగ్ జరుగుతుందన్నారు. ఇంటి యజమాని వివరాలతో కుటుంబ సభ్యుల పేర్లను అనుసంధానం చేస్తారన్నారు. డూప్లికేట్ ఓట్లు, చనిపోయిన వారి పేర్లు, చిరునామా మారిన వారి వివరాలను పరిశీలించి, జాబితా నుండి తొలగిస్తారన్నారు. బీఎల్ఓ లు మీ ఇంటికి వచ్చినప్పుడు ఆధార్ కార్డు ఇవ్వనవసరం లేదన్నారు. ఓటర్ ఐడి, ఇతర చిరునామా ఆధారాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఏదైనా అభ్యంతరాలు ఉంటే జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 మధ్య దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ వినయ్ కుమార్, వివిధ పార్టీల రాజకకీయ నాయకులు షేక్ అప్జల్, యంజాల జనార్దన్, యూసుఫ్ ఖాద్రీ, మనోజ్ కుమార్, సయ్యద్ అలీ, హసన్ షా, అహ్మద్ బామ్ షేక్ హలీం, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!