ePaper
Sunday, May 3, 2026
📄 ePaper
Homeతెలంగాణరంగారెడ్డిదుష్టశక్తులు ప్రకృతి ప్రకోపాల నుంచి కాపాడే సర్వదేవతల స్వరూపం బొడ్రాయి 

దుష్టశక్తులు ప్రకృతి ప్రకోపాల నుంచి కాపాడే సర్వదేవతల స్వరూపం బొడ్రాయి 

📰 Generate e-Paper Clip

సర్వ దేవతల సమ్మేళనం బొడ్రాయి సంబరం

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య 

గ్రామంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దుష్టశక్తులు, ప్రకృతి ప్రకోపాల నుంచి కాపాడే సర్వదేవతల స్వరూపం బొడ్రాయి అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జల్ పల్లి డివిజన్ 65 వ పరిధిలోని జల్ పల్లి గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో, ఆధ్యాత్మిక శోభతో నిర్వహించబడింది. వేలాదిగా తరలివచ్చిన గ్రామస్తులతో ప్రాంతం పండుగ వాతావరణాన్ని తలపించింది. భక్తి భావంతో ఊరంతా ఏకమై నిర్వహించుకున్న ఈ వేడుక ఐకమత్యానికి ప్రతీకగా నిలిచింది. ఈ విశిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి , అవినాష్ హాజరై, గ్రామానికి రక్షణగా నిలిచే బొడ్రాయి దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ గ్రామ సరిహద్దులను నిర్ణయించి, ఊరికి ఎలాంటి కష్టాలు, అంటువ్యాధులు రాకుండా కాపాడే గ్రామ దేవత బొడ్రాయి అమ్మవారు. జల్ పల్లి గ్రామం ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని, ప్రతి ఇంటా సుఖశాంతులు వెల్లివిరియాలని అమ్మవారిని ప్రార్థించానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సూరెడ్డి కృష్ణారెడ్డి, యంజాల జనార్ధన్, షేక్ అప్జల్, యంజాల అర్జున్, బాలరాజ్ గౌడ్, జంగారెడ్డి, గోపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఇద్రీస్ , సైయీద్ పటేల్ , గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!