ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeతెలంగాణరంగారెడ్డివిద్యార్థులకు టెక్నాలజీపై అవగాహన కల్పించడంతో మానసిక వికాసం, సృజనాత్మకత మరింత పెరుగుతుంది

విద్యార్థులకు టెక్నాలజీపై అవగాహన కల్పించడంతో మానసిక వికాసం, సృజనాత్మకత మరింత పెరుగుతుంది

📰 Generate e-Paper Clip

బీ ద చేంజ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు టెక్నాలజీపై అవగాహన కల్పించే సమ్మర్ క్యాంపులు నిర్వహించడం వల్ల వారి మానసిక వికాసం, సృజనాత్మకత మరింత పెరుగుతుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు‌. జీహెచ్ఎంసీ పరిధి ప్రశాంతి హిల్స్ 58వ డివిజన్‌లో బీ ద చేంజ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థినీ, విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ ఎడ్యుకేషన్, కోడింగ్, రోబోటిక్స్, ఏఐ వేసవి శిక్షణ తరగతులను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇలాంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు టెక్నాలజీపై అవగాహన కల్పించే సమ్మర్ క్యాంపులు నిర్వహించడం వల్ల వారి మానసిక వికాసం, సృజనాత్మకత మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కోడింగ్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో విద్యార్థులు ముందంజలో నిలవాలంటే ఇలాంటి శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న బీ ద చేంజ్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీ ద చేంజ్ వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ చల్లా రామ్ కళ్యాణ్, వైస్ ప్రెసిడెంట్ వసంత కుమారి, జనరల్ సెక్రెటరీ ఎం స్వప్న, సభ్యులు, స్వాతి అక్షాజ్, హర్ష, ఆదిత్రి, సుకన్య , బీఆర్ఎస్ నాయకులు అరకల భూపాల్ రెడ్డి, ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్, దీప్లాల్ చౌహన్, దయానంద్ ముదిరాజ్ , శీను నాయక్, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!